ఇంట్లోనే కరోనా టెస్ట్.. ఈ తప్పులు చేయరాదంటున్న నిపుణులు
- చిన్న చిన్న తప్పులతోనే తప్పుడు ఫలితాలు
- డీప్ ఫ్రీజర్ లో టెస్ట్ కిట్ ను పెట్టకూడదు
- ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే టెస్ట్ వద్దు
కొంచెం జ్వరం, దగ్గు వచ్చినా, జలుబు చేసినా కరోనానేనా? అనే డౌటు ప్రతి ఒక్కరిలో ఉంటోంది. అయితే, టెస్టు చేయించుకుందామన్నా, ఆసుపత్రులకు వెళ్దామన్నా వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలోనే పలు సంస్థలు ఇంటి వద్దనే టెస్టు చేసుకునేలా సెల్ఫ్ టెస్టింగ్ కిట్లను తీసుకొచ్చాయి. అయితే, టెస్ట్ ఎలా చేసుకోవాలో సూచిస్తూ దాంట్లో వివరాలిచ్చినా.. చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. దీంతో ఫలితం తేలక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడంపై నిపుణులు పలు సూచనలిస్తున్నారు. చేయకూడని తప్పులను వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం..
కరెక్ట్ టెంపరేచర్ లో స్టోరేజ్..
మామూలుగా అయితే 2 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తేనే సెల్ఫ్ టెస్ట్ కిట్ల ద్వారా కచ్చితమైన ఫలితం తెలుస్తుంది. అయితే, కొంతమంది డీప్ ఫ్రీజర్ లో పెట్టేస్తుంటారు. అలా చేస్తే టెస్ట్ కిట్ లోని ప్రధానమైన భాగాలు పాడైపోయి సరైన ఫలితం రాదు. కాబట్టి ఇటు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద గానీ.. లేదంటే కనీస ఉష్ణోగ్రతల కన్నా తక్కువ వద్దగానీ స్టోర్ చేయరాదు.
ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే టెస్ట్ వద్దు
చల్లటి ఉష్ణోగ్రతల వద్ద ఉన్నప్పుడు కిట్ సరిగ్గా పనిచేయదు. ఒకవేళ కిట్ ను ఫ్రిజ్ లో పెట్టినట్టయితే.. తీసిన వెంటనే వాడరాదు. చల్లదనం పోయేంత వరకు వేచి చూడాలి. కనీసం అరగంటసేపైనా గది ఉష్ణోగ్రత వద్ద కిట్ ను పెట్టాలి. ఆ తర్వాతే టెస్టు చేసుకోవాలి. అంతేగానీ, ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే టెస్ట్ చేసుకోవద్దు.
ఎక్స్ పైరీ డేట్..
మందులకు ఉన్నట్టే టెస్ట్ కిట్లకూ ఎక్స్ పైరీ డేట్ అంటూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాడే యాంటీ జెన్ లు నిర్ణీత కాలం వరకే పనిచేస్తాయి. కాబట్టి ఆ ఎక్స్ పైరీ డేట్ ను కూడా చెక్ చేసుకోవాలి. గడువు తీరితే ఫలితం సరిగ్గా రాకపోవచ్చు.
ఎక్కువ సేపు తెరచిపెట్టకూడదు
చాలా మంది పరీక్ష చేసుకుందామన్న ఉద్దేశంతో కిట్ ను తెరిచి పెడుతుంటారు. చాలా సేపటిదాకా చేసుకోరు. కానీ, అలా చేయకూడదు. టెస్ట్ కు అంతా సిద్ధం అనుకున్నాకే కిట్ ను తెరవాలి. ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టడం వల్ల గాలిలోని ధూళి కణాలు లేదా ఇతర బ్యాక్టీరియాలు దాని మీద చేరి తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పుడు పాజిటివ్ లు లేదా తప్పుడు నెగెటివ్ లు వచ్చే ముప్పు ఉంటుంది.
ఎర్లీగానూ వద్దు.. లేట్ కూడా చేయొద్దు
మామూలుగా మనకు కరోనా సోకిన లేదా లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత గానీ యాటీ జెన్ టెస్టులు వైరస్ ను గుర్తించలేవు. కాబట్టి టెస్టును సరైన టైంలోనే చేసుకోవాలి. లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత చేసుకుంటే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అతి ఆలస్యం కూడా పనికిరాదు. వారం తర్వాత చేసుకున్నా టెస్టులతో పెద్దగా ఫలితం ఉండదు.
టెస్టుల్లోనూ రకాలు..
యాంటీ జెన్ టెస్టుల్లోనూ రకాలున్నాయి. కొన్నింటిని ముక్కు ద్వారా చేస్తే.. మరికొన్నింటిని నోటి లాలాజలం ఆధారంగా చేస్తారు. కాబట్టి అది ఏ రకం టెస్టు అన్న దానిని టెస్టుకు ముందే చెక్ చేసుకోవాలి. ఎన్ని చుక్కల శాంపిల్ వేయాలి? ఎంత సమయం పడుతుంది? అన్న విషయాలను టెస్ట్ కిట్ లో వచ్చే సూచనలు చదివి తెలుసుకోవాలి.
నాసల్ శ్వాబ్ ను ముట్టుకోవద్దు
ముక్కు లేదా నోటి నుంచి శాంపిల్ తీసుకునేటప్పుడు శ్వాబ్ ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. శ్వాబ్ ను చేతితో తాకకూడదు. దాని వల్ల మన చేతికున్న మలినాలు శ్వాబ్ కు అంటి ఫలితం తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది.
ముక్కును శుభ్రం చేసుకున్నాకే తీయాలి
టెస్టుకు ముందు ముక్కును చీదేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్ది సేపటికి శాంపిల్ తీయాలి. ముక్కులోపల 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపలికి శ్వాబ్ ను తీసుకెళ్లి శాంపిల్ ను తీసుకోవాలి.
అరగంట ముందు తినొద్దు.. తాగొద్దు
నోటి ద్వారా చేసే టెస్టుకు అరగంట ముందు తినడంగానీ, తాగడం గానీ చేయకూడదు. బబుల్ గమ్ నమలొద్దు. సిగరెట్ తాగడంగానీ, పళ్లు తోముకోవడం వంటివిగానీ చేయరాదు. మద్యం కూడా సేవించకూడదు.
కిట్ మీద సీ, టీ అనే రెండు లైన్లు ఉంటాయి. సీ మీద మాత్రమే లైన్ వస్తే కరోనా నెగెటివ్ అని అర్థం. సీ, టీ రెండింటి మీద లైన్ వస్తే పాజిటివ్ అని అర్థం. అలా కాకుండా సీ మీద లైన్ రాకుండా టీ మీద వచ్చినా, సీ–టీ రెండింటి వద్ద లైన్ రాకపోయినా టెస్టును సరిగ్గా చేయలేదని అర్థం.