మద్యం మితంగా తీసుకోవచ్చా? వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- మోతాదు ఎంత అయినా ముప్పే
- గుండె దెబ్బతినే ప్రమాదం
- క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది
- ఏటా 30 లక్షల మంది మృతి
మద్యం (ఆల్కహాల్) తీసుకోవడం పాశ్చాత్య జీవనశైలిలో భాగం. మన దేశంలోనూ ఈ సంస్కృతి పెచ్చుమీరుతోంది. కానీ, మన దేశంలో మితం కంటే, అపరిమితంగా తాగే వారు ఎక్కువ. ‘మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది’ అన్న ఒక అపోహ ప్రచారంలో ఉంది. కానీ, మద్యం తాగడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుంటే దాని జోలికి వెళ్లాలంటేనే భయపడతారు.
మద్యం తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మందికి పైనే ప్రాణాలు విడుస్తున్నారు. గుండె జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, జీర్ణకోశం ఇలా ఎన్నో ప్రభావితమవుతున్నాయి. కొంచెం తీసుకున్నా, ఆల్కహాల్ తో గుండె జబ్బుల రిస్క్ ను స్వయంగా కొని తెచ్చుకున్నట్టేనని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే అంటోంది. మద్యంతో గుండె ప్రమాదంలో పడుతుందని చెబుతోంది. మద్యానికి దూరంగా ఉండాలని సిఫారసు చేస్తోంది.
మద్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మద్యం తీసుకోవడం వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నట్టు ఆక్స్ ఫర్డ్ అధ్యయనం తేల్చింది. ఇందులో సుమారు 4 లక్షల మరణాలు కేన్సర్ కారణంగా ఉంటున్నాయని తెలిపింది. నోటి క్యాన్సర్, గొంతు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
మద్యానికి ధూమపానం తోడయితే, ఇతర ఆరోగ్య సమస్యలు, స్థూల కాయం వంటి వాటితో బాధపడుతున్న వారికి రిస్క్ మరింత పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కనుక దీర్ఘాయుష్షు కోసం మద్యాన్ని దూరం పెట్టడమే మంచిది.