9వ ఫ్లోర్‌లోని బాల్కనీ నుంచి 8వ ఫ్లోర్‌లోకి బిడ్డను దించిన తల్లి.. చాటుగా తీసిన వీడియో వైరల్
- కింది ఫ్లోర్‌లో పడిపోయిన వస్త్రాలు
- బిడ్డ ప్రాణాలు రిస్క్‌లో పెట్టిన తల్లి
- బెడ్ షీట్ సాయంతో చిన్నారిని దించిన వైనం
- తీవ్ర విమర్శలు.. హర్యానాలో ఘటన
ఓ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉంటోన్న కుటుంబానికి సంబంధించిన వస్త్రాలు కింద ఫ్లాట్‌లో పడిపోయాయి. వాటిని మెట్లు దిగి వెళ్లి తెచ్చుకోకుండా ఓ మహిళ నిర్లక్ష్యంగా తన బిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టి, బాల్కనీ నుంచి బెడ్‌షీట్ సాయంతో కింద ఫ్లోర్‌కు చిన్నారిని దింపి మళ్లీ పైకి లాగింది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తల్లిపై నెటిజన్లు విమర్శలు జల్లు కురిపిస్తున్నారు. తొమ్మిదో ఫ్లోర్ నుంచి బాల్కనీ ద్వారా ఆ తల్లి తన బిడ్డను బెడ్‌షీట్ సాయంతో దించడంతో, ఆ చిన్నారి వస్త్రాలు తీసుకుని వచ్చి ఆ బెడ్‌షీట్‌నే పట్టుకుని మళ్లీ పైకి వచ్చాడు.
ఈ దృశ్యాలను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంపై మీడియా ఆ తల్లిని ప్రశ్నించింది. దీంతో ఇలా చేసినందుకు క్షమించాలని ఆమె కోరింది. తన చర్యను వీడియో తీస్తున్నారని తనకు తెలియదని చెప్పుకొచ్చింది. తొమ్మిదో ఫ్లోన్‌లోని బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోవడం, ఆ కింది ఫ్లోర్‌లోని ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె తన బిడ్డను దింపినట్లు తెలిసింది.
అయితే, ఆ బిడ్డ క్షేమంగా ఈ పని పూర్తి చేయడంతో సరిపోయింది కానీ, ఒక్కసారిగా పట్టు తప్పితే తొమ్మిదో ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాపాయం సంభవించేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వస్త్రాల కోసం బిడ్డ ప్రాణాలు ఫణంగా పెట్టి ఇంత తెలివి తక్కువగా వ్యవహరించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.