దూసుకుపోతున్న 'వలిమై' తెలుగు ట్రైలర్!
- అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
- యాక్షన్ ప్రధానంగా సాగే కథ
- ప్రతినాయకుడిగా కార్తికేయ
- పాన్ ఇండియా స్థాయిలో విడుదల
అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మాణంలో 'వలిమై' రూపొందింది. సీహెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వాయిదా వేసుకున్నారు. అలా వాయిదా వేసిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తూ వదిలిన ఈ ట్రైలర్, ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అనువాద చిత్రమైనప్పటికీ అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఛేజింగ్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో అజిత్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక విలన్ గా చేసిన కార్తికేయ ఒక దోపిడీ ముఠాకి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య నడిచే గేమ్ ఇది. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.