తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు!
- మే 9- 12వ తేదీ మధ్య ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు
- షెడ్యూల్ ఈరోజు విడుదలయ్యే అవకాశం
- ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. తాజాగా పదో తరగతి షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ఎస్ఎస్ఈ బోర్డు సిద్ధమవుతోంది. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య పరీక్షలు ప్రారంభం కానున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఒకవేళ ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాకే పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తే... మే 11 లేదా 12 తేదీల్లో పరీక్షలు ప్రారంభమవుతాయి. వాస్తవానికి ఏప్రిల్ లోనే పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేశారు. అయితే కరోనా థర్డ్ వేవ్ రావడంతో పరీక్షలు మే నెలకు మారాయి. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఈరోజే విడుదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.