నేడే మూడో వన్డే.. క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్.. పరువు నిలుపుకోవాలనుకుంటున్న విండీస్!
- ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్
- నేటి మ్యాచ్ లో ఆడనున్న శిఖర్ ధావన్
- విండీస్ ను వేధిస్తున్న బ్యాటింగ్ వైఫల్యాలు
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు మూడో వన్డే జరగనుంది. మూడు వన్డేల ఈ సిరీస్ ను ఇప్పటికే 2-0 తేడాతో ఇండియా కైవసం చేసుకుంది. మూడో వన్డేలో కూడా జయకేతనం ఎగురవేసి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఇండియా ఉంది.
ఇక ఈ మ్యాచ్ నామమాత్రమే కావడంతో... రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించి, వారిని పరీక్షించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరోవైపు కరోనా నుంచి స్టార్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కోలుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నాటి మ్యాచ్ లో ధావన్ ఆడుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
మరోపక్క, వెస్టిండీస్ జట్టు బలంగా ఉన్నప్పటికీ... బ్యాటింగ్ లో వైఫల్యాలు ఆ జట్టును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఈ మ్యాచ్ కు కూడా బ్యాటింగే వారిని వేధిస్తోంది. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని విండీస్ భావిస్తోంది. మరోవైపు రెండో వన్డేకు దూరమైన కీరన్ పొలార్డ్ ఈ మ్యాచ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.