కేరళలో 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్

  • జ్వరంతో ఆసుపత్రిలో చేరిన యువకుడు
  • పరీక్షల్లో మంకీ ఫీవర్‌గా గుర్తింపు
  • ఈ ఏడాది ఇదే తొలి కేసు
కరోనా కేసులతో వణుకుతున్న కేరళలో ఇప్పుడు మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. వయనాడు జిల్లాలోని గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ఇటీవల జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు అతడిలో మంకీ ఫీవర్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అతడికి పరీక్షలు నిర్వహించగా మంకీ ఫీవర్‌గా నిర్ధారణ అయింది.

బాధిత యువకుడికి ప్రస్తుతం మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ)నే మంకీ ఫీవర్‌గా పిలుస్తుంటారు. కేరళలో మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి. కాగా, గత నెలలో కర్ణాటకలోనూ ఓ కేసు నమోదైంది.


More Telugu News