విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

  • ల్యాండ్ అయిన తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఎత్తివేత
  • 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు అప్ లోడ్ చేస్తే చాలు
  • ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలు ఎత్తివేత
అంతర్జాతీయ ప్రయాణికులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు తప్పనిసరి అయిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలను ఎత్తేసింది. ఈ మేరకు తాజా నిబంధనలను విడుదల చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్లను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని, దాన్ని సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సిన నిబంధనను కేంద్రం తొలగించింది. ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తేసింది. దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలని సూచించింది.


More Telugu News