యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై పినరయి విజయన్ ఫైర్

  • ఆలోచించి ఓటు వేయకపోతే కేరళ, బెంగాల్ మాదిరి యూపీ మారుతుందన్న యోగి
  • యూపీ కేరళగా మారితే మంచి విద్య, వైద్యం అందుతుందన్న పినరయి
  • మతాల పేరుతో చంపుకోవడం ఉండదని వ్యాఖ్య
యూపీలో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈనేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. లేని పక్షంలో ఉత్తరప్రదేశ్ కూడా మరో బెంగాల్, కశ్మీర్, కేరళ మాదిరి మారుతుందని అన్నారు.

యోగి చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కేరళ మాదిరి యూపీ మారితే... యూపీ విద్యార్థులకు మంచి విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని... కులాలు, మతాల పేరుతో హత్యలు జరగవని చెప్పారు. మంచి సాంఘిక సంక్షేమం అందుబాటులోకి వస్తుందని అన్నారు. యూపీ కేరళగా మారితే మత సామరస్యం పెరుగుతుందని, మతాల పేరుతో చంపుకోవడం ఉండదని చెప్పారు. యూపీ ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదేనని అన్నారు.


More Telugu News