కొత్త జిల్లాలపై సీఎం జగన్ కీలక ప్రకటన
- ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుంది
- ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలి
- పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పారు. దీనికి సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాల్లో కూడా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని చెప్పారు. కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదని అన్నారు.
ఉగాది నాటికల్లా ఉద్యోగుల విభజన, అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి కావాలని జగన్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు వాటిపై నిశిత పరిశీలన చేయాలని అన్నారు. జిల్లా పరిషత్ ల విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు.