నేను సినిమాలకి పనికిరానని అన్నారు: సుధీర్ బాబు
- ఆరంభంలో అలాంటి కామెంట్స్ విన్నాను
- నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను
- ఎవరినీ ఫేవర్ చేయమని అడగలేదు
- నాకు నేనుగా ఈ స్థాయికి వచ్చానన్న సుధీర్ బాబు
బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, తమ టాలెంట్ ను మాత్రమే నమ్ముకుని ముందుకు వెళుతున్న కథానాయకులలో సుధీర్ బాబు ఒకరుగా కనిపిస్తాడు. తన కెరియర్ ను మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.
"నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక కెమెరామెన్ నా ఫేస్ ఫొటో జెనిక్ కాదనీ .. నేను సినిమాలకి పనికిరానని తన టీమ్ తో చెప్పాడు. ఆ మాటలు నా చెవిన పడినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నన్ను నేను నిరూపించుకోవాలనే పట్టుదల అప్పుడే మొదలైంది. అప్పటి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాను.
'ప్రేమ కథా చిత్రమ్' సినిమా చూసిన తరువాత 'ఇక నీకు ఢోకా లేదు' అని మహేశ్ చెప్పినప్పుడు, నాపై నాకు అపారమైన నమ్మకం కలిగింది. అయితే ఏ రోజున కూడా కెరియర్ పరంగా నాకు ఈ ఫేవర్ చేసి పెట్టమని కృష్ణగారిని గానీ .. మహేశ్ ను గాని నేను అడగలేదు. నాకు ఇంతవరకూ వచ్చిన గుర్తింపు ఏదైనా ఉందంటే, అది నేను కష్టపడి సంపాదించుకున్నదే" అని చెప్పాడు సుధీర్ బాబు.