నేను 'ఖిలాడి' చేయడానికి కారణం అతనొక్కడే: రవితేజ
- నిన్న జరిగిన 'ఖిలాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్
- నేను హార్డు వర్కునే తప్ప అదృష్టాన్ని నమ్మను
- దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు
- ఇద్దరు హీరోయిన్స్ స్టార్స్ అవుతారన్న రవితేజ
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ - పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై రవితేజ తనదైన స్టైల్లో మాట్లాడారు.
"నేను ఈ సినిమాను చేయడానికి కారకుడు రైటర్ శ్రీకాంత్ విస్సా. ఆయన చెప్పిన కథ .. చెప్పిన తీరు నచ్చడం వల్లనే నేను ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమా చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ ఇచ్చే క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఆయనతో కలిసి మరికొన్ని సినిమాలు చేస్తున్నాను. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది.
ఇక నేను ఈ సినిమా చేయడానికి రెండవ కారణం కోనేరు సత్యనారాయణగారు. ఆయనలోని మంచితనం .. నిజాయతీ నాకు నచ్చాయి. నేను హార్డ్ వర్క్ నే తప్ప అదృష్టాన్ని .. జాతకాలను ఎక్కువగా నమ్మను. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా నాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మీనాక్షి - డింపుల్ చాలా బాగా చేశారు. వాళ్లిద్దరూ స్టార్స్ అవుతారనే నమ్మకం నాకు ఉంది.