'డీజే టిల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!
- 'డీజే టిల్లు'గా సిద్ధు జొన్నలగడ్డ
- యూత్ లో ఆసక్తిని పెంచిన ట్రైలర్
- ఫ్యామిలీ ఆడియన్స్ రావొచ్చన్న డైరెక్టర్
- ఈ నెల 12వ తేదీన విడుదల
ఈ మధ్య కాలంలో యూత్ లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తించిన సినిమాగా 'డీజే టిల్లు'ను గురించి చెప్పుకోవచ్చు. చూడటానికి ఇది చిన్న సినిమాగా కనిపించినప్పటికీ, నిర్మించినది మాత్రం పెద్ద బ్యానర్. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన ఫిల్మ్ నగర్ - రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లోని రొమాంటిక్ సీన్స్ చూసి ఇది యూత్ కి మాత్రమే అనుకోవద్దనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాను హాయిగా చూడవచ్చని విమల్ కృష్ణ చెబుతున్నాడు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి. .
సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన ఫిల్మ్ నగర్ - రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లోని రొమాంటిక్ సీన్స్ చూసి ఇది యూత్ కి మాత్రమే అనుకోవద్దనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాను హాయిగా చూడవచ్చని విమల్ కృష్ణ చెబుతున్నాడు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.