రెండో వన్డేలో భారత టాపార్డర్ తడబాటు... 50 ఓవర్లలో 237/9
- అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
- రాణించిన సూర్యకుమార్, కేఎల్ రాహుల్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన భారత్ కు టాపార్డర్ వైఫల్యం ప్రతికూలంగా మారింది. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5, రిషబ్ పంత్ 18, కోహ్లీ 18 పరుగులు చేశారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
సూర్యకుమార్ యాదవ్ 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేయగా, కరోనా నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. సుందర్ 24, దీపక్ హుడా 29 పరుగులతో ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 2, అల్జారీ జోసెఫ్ 2, కీమార్ రోచ్ 1, జాసన్ హోల్డర్ 1, అకీల్ హోసీన్ 1, ఫాబియెన్ అలెన్ 1 వికెట్ తీశారు.