'సర్కారువారి పాట' నుంచి ఫస్టు సాంగ్ పోస్టర్!

  • పరశురామ్ నుంచి 'సర్కారువారి పాట'
  • మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఈ నెల 14న ఫస్టు లిరికల్ సాంగ్ 
  • మే 12వ తేదీన సినిమా రిలీజ్
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ రూపొందించిన 'సర్కారువారి పాట' సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే చక చకా అప్ డేట్స్ వదిలారు. ఆ తరువాత ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీకి .. ఆ తరువాత మే 12వ తేదీకి వాయిదా పడింది. దాంతో అప్ డేట్స్ మధ్య గ్యాప్ వచ్చేసింది. అభిమానుల్లో అసంతృప్తి పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 'కళావతి' అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. పోస్టర్ చూస్తుంటే, ఈ సాంగ్ లో కీర్తి సురేశ్ అందాలు ఆరబోయడంలో మొహమాటానికి పోనట్టే కనిపిస్తోంది.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన స్వరపరిచిన ఈ పాట ఎంతమంది హృదయాలను ఎడాపెడా దోచేస్తుందో చూడాలి. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది.


More Telugu News