ఈ 14న పీఎస్ఎల్వీ సీ-52ను ప్రయోగించనున్న ఇస్రో.. మిషన్ పూర్తి వివరాలు ఇవిగో!

  • ఫిబ్రవరి 14 ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం
  • ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్లనున్న రాకెట్
  • లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అనుమతి లభించిన తర్వాత కౌంట్ డౌన్ ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఫిబ్రవరి 14న ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.

ఈ ప్రమోగం ద్వారా 1,710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు శాలిలైట్లను పీఎస్ఎల్వీ తనతో పాటు నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈఓఎస్-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్ లకు సంబంధించి ఈ శాటిలైట్ హై క్వాలిటీ ఇమేజెస్ ను తీసి, పంపిస్తుంది.

మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటి ఇన్స్పైర్ శాట్-1. దీన్ని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ పేరు ఐఎన్ఎస్-2టీడీ. ఇది ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అప్రూవల్ లభించిన తర్వాత 25 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది.


More Telugu News