లతా మంగేష్కర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ఆమె మాటల్లో..
- చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న లత
- కొన్ని విషయాలు మన మనసుకు మాత్రమే తెలుసని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లత
- దేవుడు తనకు ఇచ్చిన పనితో సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్య
గానకోకిల లతా మంగేష్కర్ గత ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో 92 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. కెరీర్ పరంగా ఎవరికీ అందనంత అత్యున్నత స్థానానికి ఆమె చేరుకున్నారు. భారతీయ సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఆమెను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది.
మరోవైపు లత తన జీవితంలో పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిణిగానే మిగిలిపోయింది. తన చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను ఆమె భుజాన వేసుకున్నారు. నలుగురు తోబుట్టువుల మంచి చెడ్డలను ఆమే చూసుకున్నారు. కెరీర్ తో పాటు, కుటుంబ బాధ్యతలతో ఆమెకు పెళ్లి గురించి ఆలోచించే సమయమే లేకపోయింది. మరోవైపు హైప్రాఫైల్ వ్యక్తులతో ఆమెకు లింక్ ఉన్నట్టు ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఏరోజు కూడా ఆమె వాటి గురించి మాట్లాడలేదు. దీంతో, ఆ వార్తలు ఆ తర్వాత కనుమరుగయ్యాయి.
2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమెకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో ఉన్న ఆ లక్కీ వ్యక్తి ఎవరు? అని ఆమెను అడగ్గా... కొన్ని విషయాల గురించి కేవలం మన మనసుకు మాత్రమే తెలుసని... ఆ విషయాన్ని తనలోనే ఉంచుకోనివ్వాలని ఆమె చెప్పారు. పెళ్లి, పిల్లలు లేకుండా జీవితానికి సంపూర్ణత్వం ఉండదనే మరో ప్రశ్నకు సమాధానంగా... ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటుంటారని... అలాంటి వాటిని పట్టించుకోకూడదని అన్నారు. వాటిని పట్టించుకుంటూ పోతే జీవితాన్ని సంతోషంగా గడపలేమని చెప్పారు. నెగెటివ్ ఎనర్జీలను మన దగ్గరకు రానివ్వకూడదని, తాను ఎప్పడూ ఇదే చేశానని తెలిపారు.
మరో ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ మాట్లాడుతూ, 'పెళ్లి ఎందుకు చేసుకోలేదని అందరూ నన్ను అడుగుతుంటారు. దీనికి సమాధానంగా నేను ఏం చెపుతానంటే... దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పనితో నేను చాలా తృప్తిగా ఉన్నా. అందరి మాదిరిగానే నాక్కూడా కొన్ని బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి. అయితే నా బాధలు తాత్కాలికమే. నేను భరించలేనిది ఏదైనా ఉందా అంటే... ఇతరులు బాధపడుతుంటే నేను చూడలేను. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా నేను ఆనందంగా ఉంటా' అని చెప్పారు.