47 అంతస్తులతో హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక ‘కో లివింగ్’ ప్రాజెక్టు
- ప్రపంచంలోనే అతి పొడవైన కో లివింగ్ స్పేస్
- 160 మీటర్ల ఎత్తులో నిర్మాణం
- ఒక రూమ్ లో రెండు పడకలు.. ట్విన్ షేరింగ్
- నెలవారీ చార్జీ ఒక్కొక్కరికి రూ.26,000-36,000
హైదరాబాద్ లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. దేశంలోనే మొదటిసారి భారీ కో లివింగ్ ప్రాజెక్టు ‘హైదరాబాద్ వన్’ (హెచ్1) ఇక్కడ కొలువుదీరనుంది. 47 అంతస్తులతో ఉండే ఈ టవర్ విద్యా, ఉద్యోగాలు చేసుకుంటూ ఒంటరిగా, అన్ని వసతుల మధ్య నివాసం ఉండాలనుకునే వారి కోసం ఉద్దేశించినది.
సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రక్ట్ పరిధిలో, రూ.1,500 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ ‘చాప్ మాన్ టేలర్’ డిజైన్ చేసింది. 2026 నాటికి ఇది పూర్తి కానుంది.
ఒక రూమ్ లో రెండు పడకలు ఉంటాయి. ఇద్దరు షేర్ చేసుకునే ఈ వసతికి నెలవారీ చార్జీ రూ.26,000-36,000 మధ్య ఉండనుంది. ఇది ప్రపంచంలో అతి పొడవైన కో లివింగ్ స్పేస్ ప్రాజెక్టు అవుతుందని, 160 మీటర్ల ఎత్తుతో ఉంటుందని సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ ఎండీ భవిష్య గుప్తా తెలిపారు.
హైదరాబాద్ లో విద్య, ఉద్యోగం కోసం వచ్చే యవ నిపుణులు, విద్యార్థులు తమ లక్ష్యమని గుప్తా చెప్పారు. సురక్షిత ప్రదేశంగా తమ ప్రాజెక్టు ఉంటుందని, మహిళల భధ్రత తమకు ప్రాధాన్యమని తెలిపారు. 47 అంతస్తులలో ఐదు అంతస్తులు పూర్తిగా మహిళల కోసం కేటాయించనున్నారు.