దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

  • నిన్న‌ 71,365 క‌రోనా కేసులు
  • కొత్త‌గా 1,217 మ‌ర‌ణాలు
  • మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,05,279
  • 170,87,06,705 డోసుల వ్యాక్సిన్ల వినియోగం  
భార‌త్‌లో కొత్త‌గా 71,365 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా వ‌ల్ల 1,217 మ‌ర‌ణాలు సంభ‌వించాయని పేర్కొంది. క‌రోనా నుంచి నిన్న 1,72,211 మంది కోలుకున్నారని, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 8,92,828 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.

క‌రోనా వ‌ల్ల సంభ‌వించిన‌ మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 5,05,279గా ఉందని వివ‌రించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని చెప్పింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.


More Telugu News