ఆస్కార్ తుది జాబితాలో భారత డాక్యుమెంటరీ చిత్రం 'రైటింగ్ విత్ ఫైర్'
- ఆస్కార్ నామినేషన్ల ప్రకటన
- భారతీయులు ఆశలు సజీవంగా నిలిపిన డాక్యుమెంటరీ
- సుస్మిత్ ఘోష్, రింటూ థామస్ సంయుక్త రూపకల్పన
- పలు ఫిలిం ఫెస్టివల్స్ లో అలరించిన 'రైటింగ్ విత్ ఫైర్'
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల తుది జాబితాలు నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి భారతీయ సినిమాలు ఆస్కార్ ఫైనల్ నామినేషన్లు పొందడంలో విఫలమయ్యాయి. కానీ, డాక్యుమెంటరీ విభాగంలో మాత్రం భారతీయుల ఆశలు సజీవంగా నిలిచాయి. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 'రైటింగ్ విత్ ఫైర్' నామినేట్ అయింది. ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని సుస్మిత్ ఘోష్, రింటు థామస్ రూపొందించారు.
దళిత మహిళలు నిర్వహించే 'ఖబర్ లహరియా' అనే వార్తాపత్రిక గురించి ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు. 'రైటింగ్ విత్ ఫైర్' డాక్యుమెంటరీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సొంతం చేసుకుంది. ప్రఖ్యాత సండేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ జ్యూరీ అవార్డు, ఆడియన్స్ అవార్డు కైవసం చేసుకుంది.