సినిమా టికెట్ల ధరల అంశంపై సీఎం జగన్ తో మంత్రి పేర్ని నాని సమావేశం
- ఏపీలో వివాదాస్పదంగా మారిన సినిమా టికెట్ల అంశం
- పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు
- టికెట్ల అంశంపై సీఎంతో మాట్లాడనున్న పేర్ని నాని
- ఎల్లుండి సీఎం జగన్ తో చిరంజీవి, సినీ పెద్దల భేటీ
సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సీఎం జగన్ తో సమావేశమయ్యారు. టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల యజమానుల సమస్యలు, ఇటీవల టికెట్ల ధరలపై ప్రభుత్వ కమిటీ అధ్యయనం తదితర అంశాలపై ఆయన సీఎంతో చర్చించనున్నారు. కాగా, ఈ నెల 10న చిరంజీవి, ఇతర సినీ పెద్దల బృందం సీఎం జగన్ ను కలవనున్నారు. ఈ నేపథ్యంలో, సీఎంతో పేర్ని నాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.