మనసులపైనా కరోనా దెబ్బ.. పెరిగిపోయిన మానసిక వ్యాధుల బాధితులు
- కరోనా తర్వాత 22 శాతం పెరిగిన కేసులు
- దేశంలో 10 కోట్ల మందికి మానసిక అనారోగ్యం
- ఏటా 700 మంది ఆత్మహత్య
- సామాజిక, ఆర్థిక సమస్యల పాత్ర
- నియంత్రించుకోకపోతే ఉత్పాదకతకూ నష్టమే
- ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా దృఢంగా ఉండడం అని కాదు. శారీరకంగా, మానసికంగా పటిష్టంగా ఉండడం. కానీ, మన దేశంలో చాలా మంది మానసిక పరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. 5.6 కోట్ల మంది డిప్రెషన్ (మానసిక దిగులు/కుంగుబాటు), 4.3 కోట్ల మంది ఆందోళన సమస్యతో బాధపడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ కేసులు మరింత పెరిగాయి.
దేశంలో ఏటా 700 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 15-39 వయసు గ్రూపు నుంచే ఎక్కువ ఆత్మహత్యలు ఉంటున్నాయి. ఉద్యోగం లేకపోవడం, హింస, కుటుంబ తగాదాలు, పరీక్షల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఆత్మహత్యకు కారణాలు.
మానసిక సమస్యలను నియంత్రించలేకపోతే దేశం ఉత్పాదకతను నష్టపోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. 2012 నుంచి 2030 మధ్య భారత్ 1.03 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని చూడొచ్చని అంచనా వేసింది.
వివక్ష, పేదరికం, ఉద్యోగ అభద్రత, సామాజిక అసమానతలు ఇవన్నీ మానసిక అనారోగ్యానికి దారితీసే అంశాలు. ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు, ప్రజా వైద్యంలో దీనికి తగినంత ప్రాధాన్యం లేకపోవడం వేధిస్తున్న సమస్యలు. నిధుల లేమి, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది కొరత కూడా సమస్యల్లో భాగమే.
అభివృద్ధి చెందిన దేశాలు ఏటా తమ హెల్త్ కేర్ బడ్జెట్ లో 18 శాతం వరకు మానసిక వ్యాధుల కోసమే కేటాయిస్తోంది. భారత్ లో ఇది 0.05 శాతంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్ లో ప్రతి లక్ష జనాభాకు 0.3 శాతమే సైకియాట్రిస్ట్ లు, 0.12 శాతం నర్సులు, 0.07 శాతం సైకాలజిస్ట్ లు అందుబాటులో ఉన్నారు.
కరోనా వచ్చిన తర్వాత మానసిక అనారోగ్య బాధిత కేసుల సంఖ్య 22 శాతం పెరిగినట్టు అంచనా. కరోనా బారిన పడితే ఒంటరి కావడం, కుటుంబ సభ్యులను కోల్పోవడం, నియంత్రణలు, ఆదాయం నష్టపోవడం ఇవన్నీ మానసిక కుంగుబాటుకు కారణమవుతున్నాయి.