యూపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఉచితాలకు పెద్ద పీట!

  • హోళీ, దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్
  • 60 ఏళ్లు దాటిన మహిళలకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్
  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల పోలింగ్ కు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో ఉచితాలకే ప్రాధాన్యతను ఇచ్చారు.

యూపీ బీజేపీ మేనిఫెస్టోలోని హైలైట్స్ ఇవే:
  • లవ్ జిహాద్ లో దోషులుగా తేలితే వారికి జైలు శిక్ష. 10 ఏళ్ల కనీస జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా.
  • ఉజ్వల పథకం కింద ప్రతి ఏడాది హోళీ, దీపావళికి ఉచితంగా ఒక్కొక్క గ్యాస్ సిలిండర్.
  • 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచితంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్.
  • ప్రతిభావంతులైన కాలేజ్ విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు.
  • రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్.
  • ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి అవకాశం.
  • రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పెంచడానికి రూ. 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు.
  • వితంతు పెన్షన్లు రూ. 1,500కు పెంపు.


More Telugu News