బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా వేలంలో అవసరమైనంత భారీ ఖర్చు చేయట్లేదు: అజిత్ అగార్కర్
- కోహ్లీని ఆర్సీబీ కొనుగోలు చేయాలి
- ఆ టీమ్ ఎల్లప్పుడూ టాప్-3 ఆటగాళ్లపైనే ఆధారపడుతోంది
- మిడిల్ ఆర్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది
తదుపరి ఐపీఎల్ సీజన్ గురించి టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ అంశంపై మాట్లాడారు. ఐపీఎల్ 14వ సీజన్ అనంతరం విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తదుపరి ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ వారాంతం జరిగే ఐపీఎల్ మెగా వేలంలోనే ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంది. దీనిపై అజిత్ అగార్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ మళ్లీ ఆ జట్టు సారథిగా బాధ్యతలు స్వీకరించడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఆర్సీబీకి అదే మంచిదని చెప్పారు. బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా సరైన జట్టును కొనుగోలు చేసేందుకు అవసరమైనంత భారీ ఖర్చు చేయలేదని ఆయన గుర్తు చేశారు.
బెంగళూరు టీమ్ ఎల్లప్పుడూ టాప్-3 ఆటగాళ్లపైనే ఆధారపడిందని ఆయన అన్నారు. ఆ జట్టు మిడిల్ ఆర్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయిందని చెప్పారు. ఈ సీజన్‌లోనూ తగినంత ఖర్చు చేయలేని స్థితిలో ఉంటే ఒక్క ఆటగాడి కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే గొప్ప ఆటగాడైనా కొన్ని మ్యాచ్‌లు గెలిపిస్తాడు కానీ, కప్పు సాధించిపెట్టలేడని చెప్పారు.