ఇప్పటికైనా బూతుల మంత్రిని తొలగించాలి: వర్ల రామయ్య
- పాశ్చాత్య సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు
- క్యాసినో నిర్వహించి, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు
- ఈ విషయాన్ని రాజ్యసభలో కనకమేడల ఎండకట్టారు
- రాష్ట్ర ప్రభుత్వ స్థితి 'కుడితిలో పడ్ద ఎలుక' లా వుంది.
ఏపీలోని గుడివాడలో క్యాసినో సంస్కృతిపై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి స్పందించారు. క్యాసినోపై రాజ్యసభలో తమ పార్టీ సభ్యుడు కనకమేడల మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగట్టారని వర్ల రామయ్య చెప్పారు.
''పాశ్చాత్య సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టి, క్యాసినో నిర్వహించి, ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిందీ ఈ ప్రభుత్వ విధానం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో ఎండకట్టిన కనకమేడలకు అభినందనలు. నిజం కక్కాలో, మింగాలో తెలియక, రాష్ట్ర ప్రభుత్వ స్థితి 'కుడితిలో పడ్ద ఎలుక' లా వుంది. ఇప్పటికైనా బూతుల మంత్రిని తొలగించాలి' అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.