చాలామంది నన్ను వేలంలోకి రమ్మన్నారు.. నేను మాత్రం ఆర్సీబీతోనే: విరాట్ కోహ్లీ

  • 8 ఏళ్లపాటు ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లీ
  • ఆర్సీబీ విధేయుడిగా ఉండడాన్నే గొప్పగా భావిస్తానన్న మాజీ సారథి
  • కప్పు అందుకోవడమే ప్రాతిపదిక కాదు
తనను కూడా వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరాయని, కానీ తాను మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తోనే ఉంటానని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాలపాటు ఆర్సీబీకి సారథ్యం వహించిన కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించాడు. తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ మెగా వేలంలోకి రావాలని గతంలో కొన్ని ఫ్రాంచైజీలు తనను సంప్రదించాయని పేర్కొన్నాడు. అయితే, తాను మాత్రం ఆర్సీబీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.

మరోవైపు, బెంగళూరుకు సుదీర్ఘంగా సారథ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోకపోవడంపై కోహ్లీ స్పందిస్తూ.. కప్పు ఎంతమాత్రమూ ప్రాతిపదిక కాదని అన్నాడు. ఎట్టకేలకు నువ్వు ఫలానా జట్టుతో ఐపీఎల్ ట్రోఫీ గెలిచావు అని జనంతో అనిపించుకోవడం కంటే ఆర్సీబీకి విధేయుడిగా ఉండడాన్నే తాను ఇష్టపడతానని స్పష్టం చేశాడు. అదే తనకు గొప్పగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎందరో ఆటగాళ్లు ట్రోఫీలు అందుకున్నారని, కానీ ఎవరూ దాని ఆధారంగా అతడితో ఉండరని అన్నాడు. మంచి వ్యక్తి అయితే అతడితో ఉంటారని, చెడ్డ వ్యక్తి అయితే అతడికి దూరంగా జరుగుతారని చెప్పుకొచ్చాడు. జీవితమంటే అదేనని వివరించాడు.


More Telugu News