మహమ్మారి ఇప్పుడప్పుడే పోయేది కాదు.. దశాబ్దాలపాటు భరించక తప్పదు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • వైరస్ ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుంది
  • కామన్‌వెల్త్ దేశాలు, ఆఫ్రికా దేశాల మధ్య వ్యాక్సినేషన్‌లో భారీ తేడా
  • వ్యత్యాసాన్ని తగ్గించడమే డబ్ల్యూహెచ్ఓ లక్ష్యం
రెండేళ్ల క్రితం ఈ ప్రపంచంపై దాడిచేసిన కరోనా భూతం ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు కొంత తగ్గుముఖం పడుతుండడంతో దేశాలన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే, అంతమాత్రాన ఊరట చెందొద్దని, వైరస్ ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఉన్న సమూహాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహమ్మారి ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అసమానతలు కొనసాగుతున్నాయని అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కామన్‌వెల్త్ దేశాల్లో 42 శాతం మంది జనాభాకు రెండు టీకాలు అందగా, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు 23 శాతంగా మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీకాల పంపిణీలో ఉన్న ఈ వ్యత్యాసాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అధనోమ్ పేర్కొన్నారు.


More Telugu News