ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే... సుప్రీంకోర్టు తీర్పు
- మణికొండలో వివాదాస్పదంగా 1,654 ఎకరాలు
- ఆ భూములు తమవేనంటున్న వక్ఫ్ బోర్డు
- గతంలో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
- 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కారు
మణికొండ జాగీర్ భూముల్లో 1,654 ఎకరాల భూమికి సంబంధించి చాన్నాళ్లుగా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. 2012లో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం 2016లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై పూర్తిస్థాయి వాదనలు విన్న సుప్రీంకోర్టు... హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. మణికొండ జాగీర్ భూములు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. సర్వ హక్కులపైనా తెలంగాణ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని జస్టిస్ హేమంత్ గుప్తా, రామసుబ్రమణియన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది.