నేను హేమమాలిని కావాలనుకోవడం లేదన్న ఆర్జేడీ ఎంపీ.. ఘాటుగా స్పందించిన హేమమాలిని!
- ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆయన ఎప్పటికీ హేమమాలిని కాలేరన్న హేమ
- డ్రీమ్ గర్ల్ కావడానికి ఎంతో కష్టపడ్డానని వ్యాఖ్య
తాను హేమమాలిని అవ్వాలనుకోవడం లేదని ఆమె రాజకీయ ప్రత్యర్థి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై హేమమాలిని అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 'నిజమే. ఆయన ఎప్పటికీ కాలేరు. హేమమాలిని అవ్వడం చాలా కష్టం' అని ఆమె అన్నారు. 'హేమమాలిని కావడం చాలా కష్టం. డ్రీమ్ గర్ల్ కావడానికి నేను ఎంతో కష్టపడ్డాను. జయంత్ చౌదరి హేమమాలిని కాగలడని మీరు అనుకుంటున్నారా? ఆయన చెప్పింది నిజమే. ఆయన హేమమాలిని కాలేరు' అని ఎద్దేవా చేశారు.