టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు కరోనా పాజిటివ్

  • కరోనా లక్షణాలతో బాధపడుతున్న జయదేవ్
  • కరోనా పరీక్షలో పాజిటివ్
  • ఐసోలేషన్ లో ఉన్నానంటూ ట్వీట్
  • తనను కలిసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
కరోనా బారినపడిన రాజకీయ నేతల జాబితాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా చేరారు. గల్లా జయదేవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

"ఎట్టకేలకు కరోనా నన్ను కూడా అంటుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన రెండేళ్లకు నాకు కరోనా వచ్చింది. లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్ అని వెల్లడైంది. వరుసగా రెండుసార్లు నెగెటివ్ వచ్చేంత వరకు ఐసోలేషన్ లోనే ఉంటాను" అని ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇటీవల తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గల్లా జయదేవ్ సూచించారు.


More Telugu News