పరిమిత వ్యాయామంతో కేన్సర్ రోగుల్లో మంచి ఫలితాలు!
- త్వరగా తగ్గుతున్న ట్యూమర్లు
- కీమోథెరపీ దుష్ప్రభావాలు తగ్గుముఖం
- బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వెల్లడి
అన్న వాహిక కేన్సర్ తో బాధపడుతున్న వారికి చికిత్సలో భాగంగా పరిమిత వ్యాయామాలు చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
పరిశోధకులు అన్నవాహిక కేన్సర్ తో బాధపడుతున్న 40 మంది రోగులను ఎంపిక చేసుకున్నారు. వారికి ఒకవైపు కీమో థెరీపీ ఇచ్చారు. మరోవైపు వారితో మోస్తరు వ్యాయామాలు చేయించారు. దీంతో కీమోథెరపీ తాలూకు ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో శారీరక కసరత్తు మంచి ఫలితం ఇస్తున్నట్టు తెలుసుకున్నారు. మరింత మందికి కీమోథెరపీ చికిత్స సూచించేందుకు ఈ ఫలితాలు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఎన్నో రకాల కేన్సర్లకు కీమోథెరపీ ఒకానొక ముఖ్యమైన చికిత్సగా ఉంటోంది. దీన్ని తీసుకున్న వారిపై ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. అలసిపోవడం, అనారోగ్యం, ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు వ్యాయామాల ద్వారా ఈ దుష్ప్రభావాలను తగ్గించే అవకాశం ఉందని గుర్తించడం సానుకూలం.
కీమో థెరపీ తోపాటు ఎక్సర్ సైజ్ చేసిన రోగుల సీటీ స్కాన్ ఇమేజ్ లను, మార్కర్లను పరిశీలించినప్పుడు.. ఎక్సర్ సైజ్ చేయని వారితో పోలిస్తే చేసిన వారిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ట్యూమర్లు తగ్గిపోతున్నాయని తెలిసింది.