ఏ మాత్రం త‌గ్గని ఉత్త‌ర‌కొరియా.. అణ్వాయుధాల అభివృద్ధికి సామగ్రి స‌మ‌కూర్చుకున్న వైనం

  • ఉత్తర కొరియాపై ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ దుందుడుకు చ‌ర్య‌లు
  • అణ్వాయుధ క్షిపణి పరీక్షల‌ను కొనసాగిస్తూనే
    ఉంద‌న్న‌ ఐరాస‌
  • క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిన వైనం
ఉత్తర కొరియాపై ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏ మాత్రం త‌గ్గడం లేదు. క్షిప‌ణుల‌ను అభివృద్ధి చేసుకునే విష‌యంలో త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ దేశం తన అణ్వాయుధ క్షిపణి పరీక్షల‌ను కొనసాగిస్తూనే ఉందని ఐక్య‌రాజ్య స‌మితి నిపుణులు ఓ నివేదికలో తెలిపారు.

మ‌రిన్ని అణ్వాయుధాల అభివృద్ధికి కావాల్సిన సామగ్రిని కూడా ఉత్తర కొరియా స‌మ‌కూర్చుకుంద‌ని పేర్కొన్నారు. క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిందని తెలిపారు. గ‌త నెల పలు పరీక్షలు కూడా జరిపిందని, ఉత్త‌ర కొరియా అణ్వస్త్రాలకు అవసరమైన సాంకేతికతను సైబర్‌ మార్గంలో సంపాదిస్తోందని అన్నారు. ఆర్థిక సంపత్తిని సైబర్ దాడుల‌తో సంపాదిస్తోందని తెలిపారు.


More Telugu News