చాలా రోజుల తర్వాత లక్షకు దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు
- నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు
- 895 మంది మృతి
- మొత్తం మృతుల సంఖ్య 5,02,874
- మొత్తం 169,63,80,755 డోసుల వ్యాక్సిన్ల వినియోగం
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. చాలా రోజుల తర్వాత లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. నిన్న దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనా నుంచి నిన్న 1,99,054 మంది కోలుకున్నారు.
అలాగే, కరోనా వల్ల నిన్న 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 11,08,938 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.