ఈరోజు హైదరాబాదుకు వస్తున్న జగన్.. షెడ్యూల్ వివరాలు ఇవిగో!

  • శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న జగన్
  • సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు ఆశ్రమంలో గడపనున్న సీఎం
  • రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు హైదరాబాదుకు వస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం 3.50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాదుకు బయల్దేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరి, రాత్రి 9.05 గంటలకు చేరుకుంటారు.  

కాగా, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఆశ్రమాన్ని సందర్శించారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.


More Telugu News