గానకోకిలకు కన్నీటి నివాళి.... ముగిసిన లతా మంగేష్కర్ అంత్యక్రియలు

  • గత నెలలో కరోనా బారినపడిన లతా
  • జనవరి 8న ఆసుపత్రిలో చేరిక
  • ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స
  • ఈ ఉదయం కన్నుమూత
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
గానకోకిల, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. అభిమానుల కన్నీటి నివాళుల మధ్య, ముంబయిలోని శివాజీ పార్క్ లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై, అభిమాన గాయని పార్థివ దేహానికి కడసారి నివాళులు అర్పించారు. విషాదంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అటు, సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగ ప్రముఖులు సైతం లతా అంత్యక్రియలకు హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదితరులు బరువెక్కిన హృదయాలతో లతా మంగేష్కర్ కు నివాళులు అర్పించారు.

జనవరి 8న కరోనాతో ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ ఈ ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజుల కిందట ఆమె కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించడంతో అభిమానులు ఎంతో ఆనందించారు. అయితే, కొన్నిరోజుల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ఈసారి ఆమె కోలుకోలేకపోయారు.


More Telugu News