టీమిండియా బౌలర్ల ధాటికి 176 పరుగులకే ఆలౌటైన వెస్టిండీస్
- అహ్మదాబాద్ లో తొలి వన్డే
- టాస్ గెలిచిన భారత్
- మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్
- చహల్ కు 4, సుందర్ కు 3 వికెట్లు
- అర్ధసెంచరీ సాధించిన హోల్డర్
టీమిండియాతో తొలి వన్డే సందర్భంగా వెస్టిండీస్ బ్యాటింగ్ లైన్ తడబాటుకు గురైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతన్న ఈ 50 ఓవర్ల మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు.
ఒపెనర్ షాయ్ హోప్ (8) ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ విండీస్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత స్పిన్నర్లు యజువేంద్ర చహల్ (4/49), వాషింగ్టన్ సుందర్ (3/30) కరీబియన్లను కకాకవిలం చేశారు. డారెన్ బ్రావో 18, షామ్రా బ్రూక్స్ 12, నికోలస్ పూరన్ 18 పరుగులు చేశారు. కెప్టెన్ కీరన్ పొలార్డ్ డకౌట్ కావడం గమనార్హం.
అయితే, ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. హోల్డర్ 71 బంతుల్లో 57 పరుగులు నమోదు చేశాడు. అతడికి లోయరార్డర్ లో ఫాబియన్ అలెన్ (29) నుంచి సహకారం లభించింది. దాంతో విండీస్ స్కోరు 150 మార్కు దాటింది. హోల్టర్ ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ కాసేపట్లోనే ముగిసింది. ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కాయి.