మరికొన్ని గంటల్లో పంజాబ్ సీఎం అభ్యర్థిపై రాహుల్ ప్రకటన.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు
- రాహుల్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న సిద్ధూ
- పంజాబ్ కు వస్తున్న నేతకు స్వాగతం అంటూ ట్వీట్
- ఏ నిర్ణయం తీసుకోకుండా గొప్ప పనులు జరగవంటూ కామెంట్
పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరనేది ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లూధియనాలో ప్రకటించనున్నారు. అయితే, అంతకుముందే కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మన కాంతి రేఖ రాహుల్ గాంధీ ప్రకటనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే. ఏ నిర్ణయమూ తీసుకోకుండా గొప్ప పనులేవీ జరగవు. ఆ నిర్ణయం కోసం, పంజాబ్ ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు విచ్చేస్తున్న మా నేత రాహుల్ గాంధీకి స్వాగతం’’ అని సిద్ధూ ట్వీట్ చేశారు.
మరికొన్నిగంటల్లో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ రానున్న నేపథ్యంలో సిద్ధూ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా ఎలాంటి ప్రకటనా రాకుండానే ఆయన చేసిన వ్యాఖ్యల్లో అంతరార్థం ఏమిటన్నది పలువురు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, సిద్ధూలు సీఎం రేసులో ఉన్నారు. మరి, రాహుల్ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారో వేచి చూడాలి.