సంబరాలకు దూరంగా ఉండాలి.. పంజాబ్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ ఆదేశం
- పంజాబ్ సీఎం అభ్యర్థిపై నేడు ప్రకటన
- ప్రకటించనున్న రాహుల్ గాంధీ
- సంబరాలు చేసుకోవద్దు
- లతా మంగేష్కర్ మృతికి నివాళిగా కాంగ్రెస్ పిలుపు
పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ నేడు ప్రకటించనుంది. అయితే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత సంబరాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులను కాంగ్రెస్ కోరింది.
ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని, నవజ్యోత్ సింగ్ సిద్ధూలలో ఎవరికి మీ ఓటు, ఇద్దరు కాదా? అంటూ పంజాబ్ ప్రజల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ కోరింది. టెలిఫోన్, ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేయాలని పిలుపునివ్వడం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును రాహుల్ గాంధీ ఆదివారం ప్రకటించనున్నారు.
లతా మంగేష్కర్ మరణానికి నివాళిగా వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ కోరడం గమనార్హం. పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇప్పటికే నివాళి తెలియజేశారు.