ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు ఊరట దక్కలేదు: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • ప్రభుత్వ ఆధిపత్య ధోరణే కార‌ణం
  • ప‌లు డిమాండ్ల‌తో విజ‌య‌వాడ‌లో ఉద్యోగుల ర్యాలీ
  • ఆ భారీ ర్యాలీ ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేసింది
  • ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో టీచ‌ర్లు విభేదించారు
ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కు సంబంధించిన డిమాండ్ల ప‌రిష్కారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి క‌న‌ప‌ర్చ‌కుండా ఆధిప‌త్య ధోర‌ణితో ముందుకు వెళ్లింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ప‌లు డిమాండ్ల‌తో విజ‌య‌వాడ‌లో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేసింద‌ని పేర్కొంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌భుత్వం నిన్న‌ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విష‌యాన్ని, వారు ప్ర‌స్తావించిన అంశాల‌ను జ‌న‌సేన పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.        

                 


More Telugu News