నిరవధిక నిరాహార దీక్ష.. మహారాష్ట్ర సర్కారుకు మరోసారి అన్నాహజారే హెచ్చరిక

  • సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు వ్యతిరేకం
  • రానున్న తరాలకు ఇది చేటు చేస్తుంది
  • నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
  • ప్రభుత్వాన్ని కోరిన అన్నా హజారే
ప్రముఖ సామాజిక సేవకుడు అన్నా హజారే మహారాష్ట్ర సర్కారుకు మరోసారి హెచ్చరిక పంపారు. సూపర్ మార్కెట్లు, రిటైల్ దుకాణాల్లో వైన్ ను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ నెల 3న లేఖ రాశారు. వైన్ విక్రయాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.

‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించాను. ఇందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశాను. కానీ, ఎటువంటి స్పందన రాలేదు’’అని అన్నా హజారే తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రానందున, మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ లేఖ రాశారు. ’’సూపర్ మార్కెట్లు, గ్రోసరీ దుకాణాల్లో వైన్ విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఇది దురదృష్టకరం. రానున్న తరాల వారికి ఇది చేటు చేస్తుంది’’అని హజారే పేర్కొన్నారు.


More Telugu News