ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వాహన ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధం.. కొన్ని సడలింపులు

  • ఇండోర్, అవుట్ డోర్ సమావేశాలకు అనుమతి
  • రాత్రి 8 తర్వాత ప్రచారం బంద్
  • ఇంటింటి ప్రచారానికీ పరిమితులు
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలను ఎలక్షన్ కమిషన్(ఈసీ) కొనసాగించింది. రోడ్డు షోలు, పాద యాత్రలు, వాహన ర్యాలీలపై నిషేధం కొనసాగించింది. రాజకీయ పార్టీలు బహిరంగంగా, భవనాల్లో (అవుట్ డోర్, ఇండోర్) నిర్వహించుకునే సమావేశాలకు సడలింపులు ఇచ్చింది.

రాజకీయ పార్టీలు భవనాల్లో సమావేశాలు నిర్వహించుకుంటే, మెత్తం సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకునే సమావేశాలకు 30 శాతం సామర్థ్యానికి పరిమితం కావాలని పేర్కొంది. ఇంటింటికీ తిరిగి చేసే ప్రచారంలో 20 మందికి మించి పాల్గొనకూడదని ఆదేశించింది.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఎన్నికల ప్రచారంపై నిషేధాన్ని ఈసీ కొనసాగించింది. యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే.


More Telugu News