గాయని లతా మంగేష్కర్ ఇకలేరు
- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస
- ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- దాదాపు నెలరోజులుగా చికిత్స తీసుకున్న గాయని
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ (92) ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆమె కన్నుమూశారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. పలు అవయవాలు పనిచేయకపోవడంతో లతా మంగేష్కర్ పరిస్థితి విషమించి, కన్నుమూసినట్లు ఆసుపత్రి వైద్యులు కూడా ప్రకటించారు.
లతా మంగేష్కర్కు కరోనా సోకడంతో ఆమెను దాదాపు నెల రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. న్యూమోనియాతోనూ ఆమె బాధపడ్డారు.
ఆమెకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందించారు. వయసు రీత్యా మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి, కోలుకున్న విషయం తెలిసిందే.