ప్రపంచకప్ గెలిచిన భారత కుర్రాళ్లకు భారీ నజరానా
- ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు ఘన విజయం
- ఆటగాళ్లు ఒక్కొక్కరికీ రూ. 40 లక్షల చొప్పున నజరానా
- సహాయ సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతి
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి దేశానికి మరో ప్రపంచకప్ అందించిన భారత కుర్రాళ్ల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో యువ భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదో ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత కుర్రాళ్లను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా అభినందించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు ఒక్కొక్కరికీ రూ. 40 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. అలాగే, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున బహుమతి ప్రకటించారు.