అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్: ఇంగ్లండ్ ను 189 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా
- నార్త్ సౌండ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- నిప్పులు చెరిగిన ఇండియా పేసర్లు
- రాజ్ బవాకు 5 వికెట్లు, రవికుమార్ కు 4 వికెట్లు
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను సమర్థంగా కట్టడి చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
పిచ్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న భారత పేసర్లు ఇంగ్లండ్ టాపార్డర్ ను కకావికలం చేశారు. ముఖ్యంగా రాజ్ బవా (5 వికెట్లు), రవికుమార్ (4 వికెట్లు) విజృంభించారు. ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. వరుస చూస్తే ఆ జట్టు 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది.
అయితే మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. 116 బంతులు ఎదుర్కొన్న రూ 12 ఫోర్లు కొట్టాడు. అతడికి జేమ్స్ సాలెస్ (34 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. అంతకుముందు, ఓపెనర్ జార్జ్ థామస్ 27 పరుగులు చేశాడు. కాగా, టోర్నీలో ఇప్పటిదాకా విశేషంగా రాణించిన భారత కుర్ర స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారు.