'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్ డేట్ ఖరారు!

  • విష్వక్సేన్ నుంచి తాజా చిత్రం
  • కథానాయికగా రుక్సార్ ధిల్లన్
  • సంగీత దర్శకుడిగా జై క్రిష్
  • మార్చి 4వ తేదీన సినిమా రిలీజ్
విష్వక్సేన్ ఇంతవరకూ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ కి కూడా ఆ తరహా కథలకి బాగా సెట్ అయింది. అయితే ఈ సారి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 'అశోకవనంలో అర్జున కల్యాణం' చేశాడు.

టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు. బాపినీడు - సుధీర్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు.

 జై క్రిష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. విష్వక్సేన్ జోడీగా రుక్సార్ థిల్లోన్ అలరించనుంది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రుక్సార్, ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి. 


More Telugu News