ముంబైలో 3 శాతం విడాకులు ట్రాఫిక్ రద్దీ వల్లే..!: అమృతా ఫడ్నవిస్

  • రహదారులపై గోతులు, వాహనాల రద్దీ
  • కుటుంబాలకు సమయం కేటాయించలేకపోతున్నారు
  • ఇది దంపతులు వేరు పడడానికి దారితీస్తోంది
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ముంబైలోని రహదారులు, ట్రాఫిక్  రద్దీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను సైతం ప్రయాణిస్తున్న సమయంలో రోడ్లపై ఎన్నో గతుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.

‘‘నేను సాధారణ పౌరురాలిగానే చెబుతున్నాను. నేను బయటకు వెళ్లినప్పుడల్లా గోతులు, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రజలు తమ కుటుంబాలకు తగినంత సమయం కేటాయించే అవకాశం ఉండడం లేదు. చెప్పాలంటే, ముంబైలో మూడు శాతం విడాకులు (దంపతులు వేరు పడడం) ఈ కారణంతోనే ఉంటున్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

అమృత ఫడ్నవిస్ ను అధికార మహా వికాస్ అఘాడీ నాయకులు తరచూ లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తుంటారు. దీంతో ఆమె సైతం అవకాశం చిక్కినప్పుడల్లా అధికార పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు వదులుతుంటారు. 


More Telugu News