లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించిందన్న వైద్యులు
- జనవరిలో కరోనా బారినపడిన లతా మంగేష్కర్
- ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిక
- ఐసీయూలో ఉంచి చికిత్స
- మరోసారి వెంటిలేటర్ అమర్చిన వైద్యులు
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. గానకోకిల లతా మంగేష్కర్ కరోనా సోకడంతో న్యూమోనియాకు గురయ్యారు. ఆమె జనవరి 8న ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు.
అప్పటినుంచి ఐసీయూలో ఉన్న ఆమె రెండు వారాల పాటు వెంటిలేటర్ పై చికిత్స పొందారు. కొద్దిగా కోలుకోవడంతో వెంటిలేటర్ తొలగించారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. ఈ మేరకు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తున్న వైద్య నిపుణుడు డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలోనే ఉన్నారని, నిపుణులైన వైద్యబృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.