కాసేపట్లో హైదరాబాద్‌కు మోదీ.. కేసీఆర్ దూరం.. స్వాగతం పలికేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై
- స్వల్ప అస్వస్థత కారణంగా పర్యటనలో పాల్గొనని కేసీఆర్
- ఇక్రిశాట్ వద్ద భారీ బందోబస్తు
- పాసులు ఉన్న శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి
ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ విమానాశ్రయం చేరుకున్నారు. నరేంద్ర మోదీ పర్యటనలో దూరంగా ఉండాలని కేసీఆర్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. స్వల్ప ఆస్వస్థత కారణంగా ఆ పర్యటనలో కేసీఆర్ పాల్గొనట్లేదు.
మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి పటాన్ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకలకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖద్వారం నుంచి 150 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించట్లేదు. ఇక్రిశాట్ పరిసర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని ఆదేశిస్తున్నారు. తనిఖీలు చేసి పాసులు ఉన్న శాస్త్రవేత్తలను మాత్రమే పోలీసులు అనుమతిస్తుండడం గమనార్హం.