యూపీలో అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ... సభ రద్దయినట్టు ప్రకటించిన ఎంఐఎం!

  • యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఒవైసీ
  • లోని పట్టణంలో బహిరంగ సభకు అనుమతిని ఇవ్వని పోలీసులు
  • చప్రౌలి పట్టణంలో యథావిధిగా జరగనున్న సభ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు లోని పట్టణంలో ఆయన బహిరంగసభను నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయన సభకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. దీంతో, బహిరంగసభను రద్దు చేస్తున్నట్టు ఎంఐఎం ప్రకటించింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం చప్రౌలి పట్టణంలో నిర్వహిస్తున్న మరో బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు.

ఇదిలావుంచితే, మరోవైపు గురువారం నాడు మీరట్ లోని ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఒవైసీ ప్రయాణిస్తున్న వాహనంపై సచిన్, శుభం అనే వ్యక్తులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. వీరికి మీరట్ లోని ఓ వ్యక్తి నుంచి పిస్టల్ వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


More Telugu News