తమిళ సినిమా రీమేక్ లో పవన్ .. సాయితేజ్?

  • తమిళంలో వచ్చిన 'వినోదాయ సితం'
  • పూర్తి వినోదభరితంగా నడిచే కథ
  • దర్శకుడిగా సముద్రఖని
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
తెలుగు తెరపైకి రీమేకులు రావడమనేది చాలా కాలంగా జరుగుతున్నదే. అయితే ఇటీవల కాలంలో రీమేకుల జోరు మరింత పెరిగిందనే చెప్పాలి. చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోలు సైతం రీమేకులు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం చాలా రీమేకులే సెట్స్ పై ఉన్నాయి.

తాజాగా తమిళంలో హిట్ కొట్టిన మరో కథ తెలుగుకు రానున్నట్టుగా తెలుస్తోంది .. ఆ సినిమా పేరే 'వినోదాయ సితం'. తమిళంలో క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయన ప్రధానమైన పాత్రను పోషించాడు.

సముద్రఖని ఈ కథను పవన్ కి వినిపించడం .. సినిమా చూపించడం జరిగిందనీ, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపించారనే టాక్ వచ్చింది. పవన్ తో పాటు మరో ముఖ్యమైన పాత్రను ఈ సినిమాలో సాయితేజ్ చేయనున్నాడనేది తాజా సమాచారం. ఆయనకి మంచి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.


More Telugu News